శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (18:04 IST)

నాంపల్లిలో ఇద్దరు భిక్షాటకుల దారుణ హత్య

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఇద్దరు భిక్షాటకులు దారుణ హత్యకు గురయ్యారు. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఇద్దరు యాచకులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. తొలి హత్య హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఒక యాచకుడిని తలపై రాయితో మోది చంపేశారు. రెండో హత్య నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడి తలను రాయితో కొట్టి చంపేశారు. 
 
రెండు హత్యల్లో కూడా తలపై రాయితో మోది చంపడంతో... ఈ రెండు హత్యలు ఒకరే చేసుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసి సిసి టివి పుటేజీల ఆధారంగా కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.