గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:16 IST)

సోష‌ల్ మీడియాలో ప్రేమ వ్య‌వ‌హారం... బ్లేడ్ తో గొంతు కోసి...

విజయవాడకు చెందిన ఒక వ్య‌క్తి  సోష‌ల్ మీడియాలో న‌డిపిన ప్రేమ వ్య‌వ‌హారం చివ‌రికి పీక‌ల‌ మీద‌కు వ‌చ్చింది. కృష్ణా జిల్లాలోని పుల్లూరు సమీపంలో ఆ వ్య‌క్తి గొంతు కోసి చంపే ప్ర‌య‌త్నం చేశారు. స్థానిక భవానీపురం హోసింగ్ బోర్డుకు చెందిన డేవిడ్‌ను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసేందుకు దుండ‌గులు య‌త్నించారు.  డేవిడ్‌ను శాంతినగర్ బుడమేరు కాలువలో పడేసి వెళ్ళారు. 
 
డేవిడ్ ఎలాగోలా బ‌యట‌ప‌డి, కాలువలో నుంచి పైకి వచ్చి ఆటో డ్రైవర్ సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం బాధితుడు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
గ‌త కొద్ది రోజులుగా కంకిపాడుకు చెందిన యువతితో డేవిడ్ సోషల్ మీడియా ద్వారా ప్రేమ వ్యవహారం న‌డుపుతున్నాడు. దీనితో యువతి అన్నయ్య, మరొక వ్యక్తి కలిసి డేవిడ్‌పై హత్యాయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇబ్రహీంపట్నం చత్తీస్‌ఘడ్ 30 నెంబర్ జాతీయ రహదారి పక్కన దుండగులు కారు వదిలేసి పరార‌య్యారు. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టి దుంగుల కోసం గాలిస్తున్నారు.