గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (16:06 IST)

ఫేస్‌బుక్ - ట్విట్టర్‌లకు ధీటుగా ట్రూత్ - వచ్చే నెలలో...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సొంతంగా ఓ సోషల్ మీడియాను ప్రారంభించనున్నారు. ఇది ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు ధీటుగా ఉండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికాలోని క్యాపిటల్ భవన్ంపై ఆయన మద్దతు దారులు దాడులకు దిగారు. ఆ తర్వాత ట్రంప్ సోషల్ మీడియా ఖాతాను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు బహిష్కరించాయి. దీంతో 9 నెలల పాటు ఆయన సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను ఏర్పాటు చేసారు. 
 
దీని ద్వారా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా యాప్‌ను ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టీఎంటీజీ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ట్రూత్ సోషల్ అనే పేరుతో సామాజిక మాద్యమాన్ని ఏర్పాటు చేయనుందని అందులో పేర్కొంది. దీన్ని వచ్చే నెలలో కొంతమంది అతిథుల సమక్షంలో ఆవష్కరించనున్నట్టు సమాచారం.