1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (11:37 IST)

కర్నూలు ఉయ్యాలవాడలో పీఎం వాణి సేవలు

ఏపీలోని కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో పీఎం (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, త్యాగానికి ప్రతి రూపంగా నిలిచిన బుడ్డా వెంగళరెడ్డి, నరసింహారెడ్డి వంటి మహనీయులు జన్మించిన ఉయ్యాలవాడకు ‘పీఎం వాణి సేవలు' రావడం హర్షణీయమన్నారు. 
 
దేశంలో ప్రతి పల్లెను స్మార్ట్‌ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో కేంద్రం చేపట్టిన పీఎం-వాణి గ్రామ యూనిట్‌గా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఆదివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలిలో విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో కలిసి బుగ్గన ఈ సేవలను ప్రారంభించారు. 
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామంగా అవతరించిన ఉయ్యాలవాడ అందరికీ మార్గదర్శకం కావాలన్నారు. చిన్న వ్యాపారులు వైఫై ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు అన్నారు. గంగుల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ సి-డాట్‌, వైడాట్‌ సంయుక్తంగా నిర్వహించే ఈ సేవలు గతంలో వాడే టెలిఫోన్‌, పబ్లిక్‌ బూత్‌ తరహాలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఎం వాణి సీఈవో సంజీవ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.