శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 16 అక్టోబరు 2021 (12:02 IST)

రక్షణ రంగంలో ప్రారంభమైన ఏడు కొత్త డిఫెన్స్‌ కంపెనీలు

దేశ రక్షణ రంగంలో ఇప్పటి వరకూ ఉన్న ఎన్నో ఏళ్లనాటి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కేంద్రం ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నూతనంగా ఏడు రక్షణ సంస్థలను ప్రారంభించింది. వీటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘ఆత్మనిర్భర భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం రక్షణశాఖ ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు (OFB)ను కార్పొరేట్‌ తరహా ఏడు నూతన ప్రభుత్వ సంస్థలుగా మార్చాలని నిర్ణయించింది. అంతేకాకుండా వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. డిజైన్‌ నుంచి ఉత్పత్తి, ఎగుమతుల వరకూ పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాల చురుకైన భాగస్వామ్యంతో రక్షణ రంగంలో ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా భారత్‌ను తీసుకురావడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
 
మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL), ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్ లిమిటెడ్ (AVANI), అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విమెంట్‌ ఇండియా లిమిటెడ్ (AWE INDIA),  ట్రూప్ కంఫోర్ట్స్ లిమిటెడ్ (TCL), యంత్రా ఇండియా లిమిటెడ్ (YIL), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL), గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL). రక్షణ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు ఈ సంస్థలను దేశానికి అంకితమిస్తున్నట్లు తెలిపారు.
 
స్వావలంబన, ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా రక్షణ రంగం వేగంగా ముందుకెళ్తోందన్న రాజ్‌నాథ్‌ సింగ్‌.. 2024 నాటికి ఎయిరో స్పేస్‌, డిఫెన్స్‌ గూడ్స్‌, సర్వీస్‌లో.. రక్షణ మంత్రతిత్వ శాఖ రూ.1,75,000 కోట్ల టర్నోవర్‌ సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.