మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (09:56 IST)

మీరాభాయ్ చానుకు బంపర్ ఆఫర్.. జీవితాంతం పిజ్జా ఫ్రీ

జపాన్ రాజధాని టొక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2021 పోటీల్లో భారత్ తరపున తొలి పతకం సాధించిన మీరాబాయ్ చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి రికార్డు నెలకొల్పిన చానుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. ఇతర సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
ముఖ్యంగా, స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తి పతకం మీద ఆశలు పెంచింది. మొత్తంమీద 202 కేజీలు ఎత్తిన చాను.. స్వర్ణ పతకం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో విఫలమైంది. దాంతో రెండవ స్థానంలో నిలవడంతో రజత పతకం సొంతమైంది.
 
దీంతో దేశవ్యాప్తంగా మీరాబాయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఇప్పటికే మీరాబాయ్ చానుకి కోటి నజరాన ప్రకటించింది మణిపూర్ ప్రభుత్వం.. అయితే తాజాగా మీరాబాయ్ కి డొమినోస్ పిజ్జా బంపర్ ఆఫర్ ప్రకటించింది. చానుకి లైఫ్ టైమ్ పిజ్జా ఆఫర్ ప్రకటించింది. 
 
మన దేశానికి పతకాన్ని తీసుకువచ్చి అందరి కలలను నిజం చేసిందుకు అభినందనలు.. రజతం తీసుకురావడం వల్ల మీరు మన దేశంలోని బిలియన్స్ ప్రజల జీవితాల్లోకి కలలను నిజం చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్న డొమినోస్.. మీ జీవితానికి సరిపడ పిజ్జాలను ఉచితంగా అందిస్తాము అని పేర్కొంటూ విషెస్ తెలిపింది.