గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (16:54 IST)

టోక్యో ఒలింపిక్స్‌-మీరాభాయి ఛాను ఎమోషన్ ట్వీట్.. చెవిరింగుల కథేంటంటే?

Meerabhai chanu
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మీరాభాయి ఛానుకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు క్రికెటర్లు, సినిమా నటీనటులు, పలువురు ప్రముఖులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 48 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి, సిల్వర్‌ మెడల్‌ సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌గా రికార్డు సృష్టించిన మీరాభాయి ఛాను.. తన విజయాన్ని దేశానికి అంకితం ఇచ్చింది. 
 
ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఎమోషన్‌ ట్వీట్‌ చేసింది. 'ఇది నా కల నిజమైన క్షణం.. నా ఈ మెడల్‌ని నా దేశానికి అంకితం ఇస్తున్నా. నేను పతకం సాధించాలని ప్రార్థించిన వంద కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో భారతీయులందరూ నాకు తోడుగా ఉన్నారు. 
 
నన్ను నమ్మి, నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా అమ్మకి శతకోటి వందనాలు.. నాకు అండగా, సపోర్ట్‌ చేసిన భారత ప్రభుత్వం, క్రీడా శాఖ, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌, రైల్వేస్‌, స్పాన్సర్లు, ఓజీక్యూ, మార్కెటింగ్‌ ఎజెన్సీలకు కృతజ్ఞతలు. నా కోచ్‌ విజరు శర్మకు, సపోర్టింగ్‌ స్టాఫ్‌కి స్పెషల్‌ థ్యాంక్స్‌.. నన్ను ప్రోత్సహించి, నాలో స్ఫూర్తినింపిన ప్రతి ఒక్కరికీ వందనాలు.. జై హింద్‌' అంటూ సుదీర్ఘమైన లేఖను పోస్టు చేసింది. 
 
మరోవైపు మీరాబాయి సాధించిన రజత పతకం మరియు ఆమె ధరించిన చెవిరింగులు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఒలింపిక్స్ రింగుల ఆకారంలో ఉన్న ఆమె బంగారు చెవి రింగులు ఐదేళ్ల క్రితం ఆమె తల్లి బహుమతిగా ఇచ్చిందట. రియో ఒలంపిక్స్‌లో గెలవడానికి గుడ్ లక్ చెప్తూ ఈ బహుమతిని అందజేసింది మీరాబాయి తల్లి.
 
2016 గేమ్స్‌లో ఆమెకు అదృష్టం తీసుకువస్తుందని తల్లి ఈ బహుమతిని అందజేసింది కానీ అక్కడ అదృష్టం తలుపు తట్టక పోయినా ప్రస్తుతం టోక్యోలో గెలిచి యావత్ భారత దేశ దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపై మీరాబాయ్ తల్లి స్పందిస్తూ తన కూతురిని టీవీలో చూశానని 2016 ఒలింపిక్స్ ముందు ఇచ్చిన చెవి రింగులు పెట్టుకుందని కానీ అప్పుడు అదృష్టం తీసుకురాకపోయినా ఇప్పుడు గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.