గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (10:27 IST)

టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసిన భారత్ హాకీ జట్టు

జపాన్ రాజధాని టోక్యో వేదికగా విశ్వ క్రీడలు (ఒలింపిక్స్ పోటీలు) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా, శనివారం జరిగిన ప్రారంభపోటీల్లో భారత పురుషులు హాకీ జట్టు శుభారంభం చేసింది. 
 
పూల్-ఏలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-2 తేడాతో గెలిచింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, రూపిందర్ పాల్ సింగ్ ఒక గోల్ చేశాడు. ఆట చివరి నిమిషాల్లో కివీస్ దూకుడు ప్రదర్శించింది. దాంతో ప్రత్యర్థి జట్టుకు వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. 
 
అయితే, సీనియర్ గోల్‌కీపర్‌ శ్రీజిష్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. శ్రీజిష్ తన అద్భుత కీపింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుకు గోల్స్ రాకుండా గోడల నిలబడి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 
 
ఇక చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ విజయంతో బోణీ కొట్టడం విశేషం. మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.