శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (11:10 IST)

భారత్ వుమెన్ జట్టులో కరోనా కలకలం.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పాజిటివ్

Harnan preet kaur
భారత క్రికెట్‌ను కూడా కరోనా వదలట్లేదు. భారత్ వుమెన్ జట్టులో కోవిడ్ కలకలం రేపింది. తాజాగా ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 
 
వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో కౌర్ ఉన్నారు. నిన్న సాయంత్రం ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఇవాళ ఉదయం తెలిసింది. గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ కరోనా టెస్టులు చేయించుకున్నారు.
 
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, బద్రీనాథ్‌, యూసుఫ్ పఠాన్‌ కూడా కరోనా బారిన పడ్డారు.