సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (12:00 IST)

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 403 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 403 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించగా, 313 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,742కు చేరింది. ఇందులో 3,00,469 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1690 మంది మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4583 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇందులో 1815 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 146 ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.98 శాతం, మరణాల రేటు 0.55 శాతం ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 33,930 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,00,53,026కు చేరింది.