సంబంధిత వార్తలు
- శశికళ రీఎంట్రీ : బీజేపీ ప్రయత్నాల్లో వివేకం - భవిష్యత్ విజ్ఞత ఉంది : విజయశాంతి
- మద్యం దుకాణాలను మూసి వేస్తున్న తెలంగాణ సర్కారు.. ఎందుకు?
- హైదరాబాదులో 66మందికి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా లేకుంటే..?
- దంచి కొడుతున్న ఎండలు.. రాగల మూడు రోజుల్లో..?
- లాక్ డౌన్ సమయంలో రెడ్ క్రాస్ సేవలు స్పూర్తిదాయకం: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించం : సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారని, లేకపోతే కనీసం వారాంతంలోనైనా అన్నీ మూసేస్తారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించబోమన్నారు. టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులు లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటున్నారా అని తనను అడిగారని, అయితే అలాంటి నిర్ణయం ఏదీ లేదని వారికి వివరించానని కేసీఆర్ తెలిపారు.
"కొందరు సినీ ప్రముఖులు నన్ను కలిశారు. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయని, పెట్టుబడులు పెట్టామని ఆ సినీ ప్రముఖులు వివరించారు. గతంలో విధించిన లాక్డౌన్ తో బాగా నష్టపోయాం... మరోసారి లాక్డౌన్ దిశగా చర్యలు లేవని వారికి స్పష్టంచేశాను.
అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగానే విద్యాసంస్థలను మూసివేశాం. విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడం బాధ కలిగిస్తున్నా, తప్పలేదు" అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
