Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్
Sirish - Dil Raju
నితిన్ తో తమ్ముడు సినిమా నిర్మించారు శిరీష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ ప్లాప్ అయితే ఎవరూ వచ్చి త్యాగాలు చేయలేదు. కనీసం ఎలా వున్నారని దర్శకుడు వచ్చి అడగలేదు. ఆ సినిమాను ఇష్టపడి తీసుకుని రిలీజ్ చేశాం. మేం ఇలా అయిపోయామని ఇండస్ట్రీలో ఎవరినీ అడిగే అలవాటు మాకు లేదని శిరీష్ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ, మా బేనర్ లో చాలా ప్లాప్ లు హిట్ లు తీశాం. నాకు చాలా ప్లాప్స్ వచ్చాయి. 21 సంవత్సరాలు ఇండస్ట్రీలో వున్నాం. ఎత్తుపల్లాలు మామూలే. అందుకే తమ్ముడు సినిమా చూశాక చెబుతున్నా. సూపర్ హిట్. ఇక అంతకుముందు రామ్ చరణ్ కు హిట్ఇవ్వలేకపోయాం. గేమ్ ఛేంజర్ తో ప్లాప్ సినిమా తీశాం. అందుకే హిట్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాం. త్వరలో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాం అని ప్రకటించారు.
