రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు
Rana Daggubati, Praveena Paruchuri
రానా దగ్గుబాటి తన బ్యానర్, స్పిరిట్ మీడియాలో రానా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' కోసం ప్రవీణ పరుచూరితో మరోసారి చేతులు కలిపారు. ఈ చిత్రం ద్వారా ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు పల్లెటూరి సున్నితమైన హాస్యంతో కూడిన, లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్. C/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి కల్ట్ ఫేవరెట్ చిత్రాలను నిర్మించిన ప్రవీణ ఇప్పుడు డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇది ఒక నాస్టాల్జిక్, హ్యుమరస్, ఆలోచింపజేసే కథ.
ఈ చిత్రం ఒక సంఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఒక గ్రామ యువకుడి నేపథ్యంలో సాగుతుంది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' కు న్యూ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నారు. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ సీక్వెన్సులు, హాస్యంతో కూడిన ఉపకథల ద్వారా ఈ చిత్రం సరికొత్త అనుభూతిని పంచబోతోంది. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉండబోతోంది.
త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్.