Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?
నటుడు నాగార్జున తనయుడు నాగ చైతన్య, నటి సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన నాలుగు సంవత్సరాల తరువాత విడిపోయారు. నాగ చైతన్య ఇటీవల నటి శోభితను రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చైతూ ఓ ఆసక్తికర విషయాన్ని తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తన మొదటి ముద్దు గురించి బహిరంగంగా మాట్లాడారు. సాధారణంగా, అతని మొదటి ముద్దు అతని మొదటి ప్రేయసి, భార్య సమంతాకే ఇచ్చి వుంటాడని అందరూ భావిస్తారు. కానీ, అతను సమంతాకి తొలిముద్దు ఇవ్వలేదు. దానికి ముందే వేరొక స్త్రీకి ఇచ్చేశాడు. ఇంకా, ఆ ముద్దు తన జీవితాంతం గుర్తుంచుకుంటానని చైతన్య అన్నాడు.
నాగ చైతన్య, శోభిత జంటగా నిర్వహించిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న నాగ చైతన్య, మొదటి ముద్దు గురించి బహిరంగంగా మాట్లాడారు. మొదటి ముద్దు ఎవరికిచ్చావ్ అని హోస్ట్ రానా అడిగిన ప్రశ్నకు.. చైతూ తొమ్మిదో తరగతిలో ఒక అమ్మాయికి ఇచ్చినట్లు చెప్పాడు.
నటుడు నాగ చైతన్య
ఇదే కార్యక్రమంలో ఆసక్తికరమైన సమాచారాన్ని చైతన్య పంచుకున్నారు. ఒక అభిమాని తనను చూసి, సమంతా కంటే మీరే కలర్‌గా వున్నారని చెప్పడం.. మరచిపోలేని జ్ఞాపకంగా చైతన్య తెలిపారు.