1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Akhil Akkineni and Zainab Ravdjee Marriage Date Fixed?

జూన్ 6వ తేదీన అఖిల్ అక్కినేని వివాహం!!

Akhil Akkineni and Zainab Ravdji
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ వివాహం జరుగనుంది. వీరిద్దరి వివాహం జూన్ ఆరో తేదీన జరుగనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
 
గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. గత యేడాది నవంబరు 26వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నిశ్చితార్థం తర్వాత ఈ జంట పలుమార్లు కలిసి విహార యాత్రలకు కూడా వెళ్ళి వచ్చారు. తాజాగా వీరి వివాహం తేదీ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 
తర్వాతి కథనం
హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?