1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 16 మే 2025 (17:39 IST)

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

Ashwin Babu, Thaman, Akhil Akkineni, Prashanth Varma, Kolanu Sailesh
Ashwin Babu, Thaman, Akhil Akkineni, Prashanth Varma, Kolanu Sailesh
నటుడు, ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు క్రికెట్ బాగా ఆడతాడు. అఖిల్ అక్కినేని, ప్రశాంత్ వర్మ, కొలను శైలేష్, సంగీతం థమన్, అశ్విన్ బాబు.. వీరంతా కలిస్తే పులిహోర మాటలే వుంటాయి. ఎంటర్ టైన్ మెంట్ లో తగ్గేదేలా అన్నట్లుగా వీరు వుంటారు.  ఈవెనింగ్ పూట, షూటింగ్ పూర్తయ్యాక జూబ్లీహిల్స్ లో క్రికెట్ మైదానంలో కలుస్తుంటారు. నిన్న రాత్రి అందరూ కలిసి క్రికెట్ ఆడారు. అందరూ జోవియల్ గా వుంటారు. అందులో థమన్, అశ్విన్ కలిస్తే వారి సంభాషణలు హైలెవల్ లో వుంటాయి. అవి వినేవారికి చాలా హై రేంజ్ లో వుంటాయి. ఇదే విషయాన్ని థమన్ మాట్లాడుతూ, అశ్విన్ మాటల్తో పులిహోర బాగా కలుపుతాడు. అందరికీ తినిపిస్తాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
 
ఇక వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాలో అశ్విన్ కథానాయకుడిగా నటించాడు. అది త్వరలో విడుదల కాబోతుంది. థమన్ గురించి అశ్విన్ మాట్లాడుతూ, నేను పులిహోర తినిపిస్తానని థమన్ అంటే అర్థం. మేం ఎక్కువగా గుళ్ళు, గోపురాలకు వెళ్ళినప్పుడు పులిహోర తింటాను. తినిపిస్తాను అని అర్థమంటూ తనదైన శైలిలో చెప్పాడు. ఇక తమన్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. నాకు మాత్రం తను ఒక ఎమోషన్. తను నాకు గాడ్ గిఫ్ట్. తను నా జీవితంలో ఉండడం వెరీ లక్కీ. మా టీజర్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ థాంక్యూ'అన్నారు. 
 
అయితే అశ్విన్ కు క్రికెట్ నేపథ్యంలో ఓ కథను ఓ దర్శకుడు చెప్పాడట. అది కూడా త్వరలో అన్నీ కలిసివస్తే సెట్ పైకి వెళ్ళనుంది. కానీ అది బయోపిక్ కాదు. క్రికెట్ ఆటను అందరూ చూపించిన విధంగా కాకుండా సరికొత్త కోణంలో లవ్ ట్రాక్ తోపాటు థ్రిల్లర్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ అది వర్కవుట్ అవడానికి చాలా సమయం పడుతుందనీ, ఒకవేళ అన్నీ సెట్ అయితే ఈ ఏడాది సెట్ పైకి వెళ్ళనున్నదని తెలుస్తోంది.