సంబంధిత వార్తలు
- Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్
- మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్
- Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు
- శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్
- భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు
మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు
Ashwin Babu, Mamidala M.R. Krishna, SS Thaman, Sailesh Kolanu
"ధర్మం దారి తప్పినప్పుడు... ఏ అవతారం రానప్పుడు... వచ్చినవాడు గౌతమ్"అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఓ యాక్ష్ మూడ్‌ను సెట్ చేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ కట్టిపడేస్తుంది. గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్ గా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టైమింగ్ అన్నీ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తదనాన్ని పంచుతుండగా, ఎమోషనల్ ఇంటెన్సిటీ కథలో ఉన్న డెప్త్‌ను తెలియజేస్తుంది.
దర్శకుడు మామిడాల ఎం.ఆర్. కృష్ణ ఈ చిత్రాన్ని ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కాకుండా, కొత్త కాన్సెప్ట్‌తో తెరపై తీసుకురావాలని టీజర్ నుంచే అనిపిస్తున్నారు. టీజర్ విజువల్స్‌ని మించిపోయేలా ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ యాక్షన్ థ్రిల్‌ని కలిపి చూపిస్తుంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ఇంటెన్స్ ని ఇచ్చింది. టెక్నికల్ స్టాండర్డ్స్ చూస్తేనే సినిమా నిర్మాణ విలువలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. మొత్తనికి టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అశ్విన్ నేను ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడకపోతే ఆరోజు గడవదు. నిజానికి అశ్విన్ గ్రౌండ్ లోకి వస్తే నాకు చాలా అసలు నచ్చదు. తను బాదుడుకి బాలు పట్టుకుంటే చేతులు నొప్పిపుడతాయి. మేము ఎమోషనల్ గా చాలా బాండ్ అయ్యాం. తను పాజిటివ్ గా ఉంటాడు. ఈ సినిమా టీజర్ చాలాసార్లు చూశాను. హరీ గౌర హనుమాన్ తో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో పేరు రావడం అంత ఈజీ కాదు. ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కృష్ణ గారి ఫ్రేమ్స్ చూస్తుంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ల అనిపించలేదు. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తీశారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది'అన్నారు
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కృష్ణ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. డెఫినెట్ చాలా కొత్త పాయింట్. మీరు ఊహించలేని పాయింటు. అది మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నాను. మంచు మనోజ్ అన్నకి థాంక్యూ సో మచ్. ఆయన వాయిస్ టీజర్ కి ప్రాణం పోసి మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత గణపతి రెడ్డి గారి పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనతో ఈ సినిమా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం ఆయన సపోర్టు. బాల్ రెడ్డి గారి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టెక్నికల్ టీం అందరికీ థాంక్యు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. ఈ టీజర్ హిట్ డైరెక్టర్ శైలేష్ కోలను గారి చేతుల మీద లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తమన్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. నాకు మాత్రం తను ఒక ఎమోషన్. తను నాకు గాడ్ గిఫ్ట్. తను నా జీవితంలో ఉండడం వెరీ లక్కీ. మా టీజర్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ థాంక్యూ'అన్నారు
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. టీజర్ కట్ చాలా బాగుంది. అశ్విన్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. తనతో కలిసి వర్క్ చేయాలనే ఉంది. నిర్మాత గణపతి గారి పాజిటివ్ ఎనర్జీ నాకు చాలా నచ్చింది. అందుకే ఈవెంట్ కి వచ్చాను. మెడికల్ థ్రిల్లర్ ఎప్పుడు కూడా గ్రేట్ కాంబినేషన్. ఈ కథ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. బాల్ రెడ్డి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హరి గౌర మ్యూజిక్ చాలా బావుంది. డైరెక్టర్ కృష్ణ కి ఆల్ ద వెరీ బెస్ట్. ఏదో ఒక వావ్ ఫ్యాక్టరీ ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఈ సినిమాలో అలాంటి వావ్ ఫ్యాక్టర్ వుంది అనిపించింది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా థియేటర్స్ లో చూడడానికి ఎదురుచూస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
హీరోయిన్ రియా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా మంచి కాన్సెప్ట్ థ్రిల్లర్ వున్న సినిమా ఇది. నిర్మాత చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. అశ్విన్ బెస్ట్ కో స్టార్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.
