హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)
సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు జీవితంలో మరిచిపోలేని మంచి రుచికరమైన విందు భోజనాన్ని వడ్డించడం ఆనవాయితీ. అలాగే, ఎలాంటి గౌరవ మర్యాదలు తగ్గకుండా దగ్గరుండి మరీ చూసుకుంటారు. తాము తయారు చేసిన అన్ని రకాలైన వంటకాలను వడ్డిస్తుంటారు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన అతిథులకు గౌరవించడం పద్దతి కాదు. అయితే, ఇక్కడ ఓ జంట మాత్రం పెళ్లి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ప్రకారం.. పెళ్లి తర్వాత ఆకలితో ఉన్న అతిథులను కూర్చోబెట్టి.. నూతన వధూవరులు మొదటి ప్లేట్‌ను వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్లేట్ కొన్న వారికి మాత్రమే ముందుగా భోజనం వడ్డిస్తామని, ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అలస్కాలోని హానీమూన్ కోసం ఉయోగిస్తామని వధూవరులు తెలిపారు. అయితే, ఒక అతిథి మాత్రం ప్లేట్ భోజనం కోసం భారతీయ కరెన్సీలో రూ.1.25 లక్షలు ఖర్చు చేసినట్టు తెలియడంతో నెటిజన్లు నోరెళ్లబెట్టడం గమనార్హం. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు గుప్పించారు.