శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (12:26 IST)

టోక్యో ఒలింపిక్స్‌లో డ్రాగన్ కంట్రీ తొలి స్వర్ణం.. నిరాశపరిచిన భారత్

టోక్యో ఒలింపిక్స్‌లో డ్రాగన్ కంట్రీ తొలి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనా క్రీడాకారిణి యాంగ్ క్యాన్ గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. క్వాలిఫై రౌండ్‌లో మన భారత షూటర్లు నిరాశ పరిచారు. దాంతో ఫైనల్లో భారత్ చోటు దక్కించుకోలేకపోయింది. అలాగే రష్యాకు చెందిన షూటర్ గలషినాకు వెండి, స్విట్జర్ లాండ్ ప్లేయర్ క్రిస్టిన్‌కు కాంస్య పతాకాలు వచ్చాయి. 
 
ప్రతి నాలుగేళ్లకు జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ ఈ ఏడాది ఒక సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్ క్రీడలు ఆలస్యమయ్యాయి. ఇక ఈ ఏడాది భారత క్రీడాకారులు 18 భాగాల్లో... మొత్తం 120 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. 
 
దాంతో భారత్‌కు ఈసారి పథకాలు రావాలని అంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా టోక్యో ఒలంపిక్స్‌లో గెలిచిన క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది.