డీఎంకే గెలిచింది.. నాలుక కోసి.. అమ్మవారికి సమర్పించాలని..?

tongue
tongue
సెల్వి| Last Updated: సోమవారం, 3 మే 2021 (16:14 IST)
తమిళనాడులో డీఎంకె విజయం సాధించినందుకు ఆ పార్టీ మహిళా అభిమాని ఒకరు ఏకంగా తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె గెలిస్తే తన నాలుకను కోసి సమర్పిస్తానని ఆమె మొక్కుకున్నారు. ఎన్నికల్లో డీఎంకె గెలవడంతో మొక్కు చెల్లించుకున్నారు.

డీఎంకె గెలిచిందని తెలియగానే స్థానిక ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడే తన నాలుకను కోసుకున్నారు. అనంతరం దాన్ని అమ్మవారికి సమర్పించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఆలయంలో కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో... ఆమె తన నాలుకను ఆలయ గేటు వద్దే పడేసి వెళ్లిపోయారు. అక్కడినుంచి ఆమె నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు.

గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పశ్చిమ గోదావరికి చెందిన మహేష్ అనే ఆంధ్రా యువకుడు తన నాలుక కోసి దేవుడికి మొక్కు చెల్లించుకున్నాడు. నాలుకను కోసి దేవుడి హుండీలో వేశాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ యువకుడిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.దీనిపై మరింత చదవండి :