బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:59 IST)

మాజీ సైనికుల‌పై రక్షణ మంత్రికి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన తరువాత మాజీ సైనికులకు సంబంధించిన పెండింగ్ సమస్యల‌ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు తీసుకెళ్ళారు. మాజీ సైనికులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపి బిజెపికి తెలియజేసిన సమస్యలు ఆధారంగా ఒక లేఖను కేంద్ర మంత్రికి పంపారు. ఆర్మీబెటాలియన్ హెడ్ క్వార్టర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం, టోల్ గేట్ లో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా మాజీ సైనికుల వాహనాలు కు టోల్ గేట్ రాయితీ వర్తింప చేయాల‌ని డిమండు చేశారు.

మిలట్రీ డిస్పెన్సరీలలో ఫార్మశీ సౌకర్యం ఇక్కడ ప్రాంతాల్లో మెరుగుపర్చాలన్న అంశాలను  సోమువీర్రాజు ఆ లేఖలో ప్రస్తావించారు. త్వరలో ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ని కలసి మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాజీ సైనికులకు హామీ ఇచ్చారు.