శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:43 IST)

Bigg Boss Telugu 5.. కెప్టెన్సీ టాస్క్‌.. ఆ ముగ్గురిలో ఎవరికి?

బిగ్ బాస్ హౌస్‌లో గెలవాలంటే తగ్గాల్సందే అనే టాస్క్ చాలా రసవత్తరంగా అవుతోంది. ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు హౌస్‌లో ఉన్న జంటలకి ఛాలెంజస్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నటరాజ్ మాస్టర్, లోబోకి వచ్చిన ఛాలెంజ్‌లో శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదాలు గెలిచారు. దీంతో వాళ్లు ఆఫ్ కేజీ బరువు తగ్గారు. నటరాజ్ మాస్టర్ టీమ్ ఆఫ్ కేజీ బరువు పెరిగింది. ఆ తర్వాత విశ్వ అండ్ రవిలు కూడా ఛాలెంజ్ లో గెలిచి ఆఫ్ కేజీ బరువు తగ్గారు. 
 
ప్రియా ఇంకా ప్రియాంక సింగ్ ఇద్దరూ కూడా ఛాలెంజ్ లో ఓడిపోయి ఆఫ్ కేజీ బరువు పెరిగారు. ఆ తర్వాత పవర్ రూమ్ యాక్సెస్ సంపాదించిన సన్నీ మానస్ జంట నటరాజ్ ఇంకా లోబోలని సెలక్ట్ చేస్కుని ఛాలెంజ్‌లో విన్ అయ్యారు.
 
ఈ మూడు జంటల్లో ఇప్పుడు ఏ జంట గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీరామ్ ఇంకా హమీద, విశ్వ, రవి, అలాగే మానస్, సన్నీలు ముగ్గురూ కూడా ఈక్వల్ పాయింట్స్‌తో ఉన్నారు. అయితే, ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కమింగ్ అప్ ప్రోమోలో చూస్తే కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురు కనిపిస్తున్నారు. వాళ్లలో శ్రీరామ్ చంద్ర, సన్నీ, శ్వేత ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే ఇంటి కెప్టెన్ గా ఈసారి ముగ్గురు పోటీ పడుతున్నారు అనిపిస్తోంది.