బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (07:51 IST)

జపాన్‌ నూతన ప్రధానిగా ఫ్యుమియో కిషిదా

జపాన్‌ నూతన ప్రధానిగా ఫ్యుమియో కిషిదా బాధ్యతలు స్వీకరించనున్నారు. అధికార లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (ఎల్‌డిపి) సంస్థాగత ఎన్నికల్లో మాజీ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిదాకు భారీ విజయం లభించింది.

ఇప్పటి వరకూ జపాన్‌ ప్రధానిగా ఉన్న యోషిహిడే సుగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నూతన ప్రధానిమంత్రి అభ్యర్థి కోసం ఈ ఎన్నికలు నిర్వహించారు. వచ్చే వారంలో కిషిదా జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ప్రస్తుత ప్రధాని యోషిహిడే సుగా గత సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అయితే కరోనాను సమర్థవంతంగా ఎదురొక్కపోవడం, వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగడం వంటి అంశాలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఏడాదిలోనే పదవి నుంచి దిగిపోతున్నట్లు ప్రకటించారు.