గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (17:35 IST)

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు - మరో ఆరుగురు వైకాపా నేతలు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన జడ్జిలుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ మరో ఆరుగురు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేసింది. 
 
గతంలో జడ్జిలు, కోర్టులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై ఏపీ హైకోర్టు కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. కాగా, 2020 అక్టోబరు 8వ తేదీన ఈ కేసును సీఐడీకి హైకోర్టు అప్పగించింది. అయితే, సీఐడీ అధికారులు కేసును సక్రమంగా విచారించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీబీఐకి అప్పగించింది. 
 
గత జులై, ఆగస్ట్ నెలల్లో  సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేసింది. తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్‌లు ఉన్నారు. ఇదిలావుంటే, ఈ నెల 6వ తేదీన హైకోర్టుకు సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించిన విషయం తెల్సిందే.