సంబంధిత వార్తలు
- నేటి నుంచి వైఎస్.షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర
- గుడ్ న్యూస్: ఆర్టీసీ లావాదేవీలు కోసం.. ఇక యూపీఐ, క్యూఆర్ కోడ్లు
- మైనర్ బాలిక మృతిపై విచారణ నివేదిక సమర్పించండి: విశాఖ సీపీ కి ఏపీ మహిళా కమిషన్ ఆదేశాలు
- రాష్ట్రంలో అకాల వర్షాలు - ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు
- నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ
బాలికపై వృద్ధుడు అత్యాచారం...
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జిల్లాలోని వడ్డేపల్లి పరిమళకాలనీకి చెందిన బింగి భిక్షపతి(69) హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్‌గా చేసి రిటైర్ అయ్యాడు.
వారి ఇంటి పక్కనే ఓ దివ్యాంగుడు కూతురితో కలిసి ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో కొద్దిరోజులుగా బాలిక తల్లి కుటుంబానికి దూరంగా ఉంటోంది. దీంతో బాలిక ఆలనాపాలన చూసేవాళ్లు కరువయ్యారు.
దీన్ని ఆసరాగా తీసుకున్న భిక్షపతి బాలికకు కొద్దిరోజులుగా మాయమాటలు చెబుతూ అత్యాచారానికి పాల్పడసాగాడు. మంగళవారం బాలిక పేరెంట్స్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. వెంటనే పేరెంట్స్ 100 కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ జనార్ధన్‌రెడ్డి చెప్పారు.
