గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:01 IST)

రాష్ట్రంలో అకాల వర్షాలు - ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో పాటు సాధారణ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వర్షాల కారణంగా వేల హెక్టార్లలో సాగైన కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూరగాయల పంటలు నీటిలోనే ఉన్నాయి. ఫలితంగా కూరగాయల కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయి. 
 
ఫలితంగా కూరగాయల ధరలు 40 శాతం మేర పెరిగాయి. ఈ ధరలు మరో నెల, రెండు నెలల పాటు ఇలాగే ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్, లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే ఉన్నాయి. కరోనా మహమ్మారికి భయపడి డ్రైవర్లు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. 
 
అయితే, ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో ఇప్పుడిప్పుడే జనజీవనం గాడిన పడుతోంది. ఇదేసమయంలో ఇప్పటివరకు స్థిరంగా ఉంటూ వచ్చిన కూరగాయల ధరలు గత రెండు, మూడు రోజులుగా ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబరు మొదటి వారంలో కురిసిన అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. ఫలితంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.