ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:52 IST)

పసిడి ప్రియులకు షాక్ : పెరిగిన బంగారం ధర...

పండగ సీజన్‌లో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్‌లో పసిడి(24 క్యారెట్లు) ధర 10 గ్రాములకు.. 120 రూపాయలు పెరిగింది. అంటే.. మంగళవారం మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 పలుకుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్.. రూ.44,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
ఇక సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి రూ.67,500 పలుకుతోంది. అదేసమయంలో 10 గ్రాముల వెండి రూ.675 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,670కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,070 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,070కు చేరింది. 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,330కి చేరింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,620 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,680కు చేరింది.