బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:24 IST)

సోష‌ల్‌మీడియాను వ‌ద‌ల‌నంటున్న స‌మంత‌

Samantha pics
ఈమ‌ధ్య న‌టి స‌మంత సోష‌ల్ మీడియానుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అందులో ఏ మాత్రం వాస్తవం లేద‌ని తెలుస్తోంది. ఆమె వైవాహిక జీవితంనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమె రెక్క‌లువ‌చ్చినా ప‌క్షిలా అన్ని ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తోంది. గుడులు, గోపురాలు తిరుగుతూ త‌న‌స్నేహితుల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇక త‌న వ్య‌క్తిగ‌తాన్ని విమ‌ర్శించిన వారిపైన కూడా కేసులు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమె లాయ‌ర్ ఇచ్చిన స‌ల‌హా, సోష‌ల్ మీడియాకూ దూరంగా వుండ‌మ‌ని. దాంతో ఇక సోష‌ల్ మీడియాకూ దూరం అవుతుంద‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
కానీ వాస్త‌వంగా ఆమె అందుకు సుముఖంగా లేదు. సోష‌ల్‌మీడియా లేనిదే స‌మంత లేద‌ని ఆమె స‌న్నిహితులు తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్ గ్రేట‌ర్ క‌మ్యూనిటీలో స్వంత ఇంటిలోకి ప్ర‌వేశించిన ఆమె త‌న దైన‌వందిక వివ‌రాల‌లో కొన్నింటిని మాత్ర‌మే పోస్ట్ చేయ‌నున్న‌ట్లు ఆమె స‌న్నిహితురాలు ప‌ల్ల‌వితో చెప్పిన‌ట్లు తెలిసింది. ఇదిలా వుంటే, తాజాగా గంట క్రిత‌మే త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను పోస్ట్ చేసింది. దానితోపాటు విజ‌య్‌తో చేసిన సినిమా నుంచి ముద్దు పెట్టే రెండు సీన్ల‌ను పోస్ట్ చేసింది. 
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు సోష‌ల్‌మీడియాను ఆదాయ మార్గాలుగా మ‌లుచుకుంటోంది.  దానివ‌ల్ల దూరం కావ‌డం అసంభ‌వ‌మ‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె త్వ‌ర‌లో అభిమానుల‌తో చిట్ చాట్ చేయ‌నుంది. ఇప్ప‌టికే ఓ హాలీవుడ్ సినిమాను చూడ‌మంటూ ప్ర‌మోష‌న్ కూడా చేసింది. ఇటీవ‌లే ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్‌కు చెందిన షూట్‌లో ఆమె పాల్గొంది. దాన్ని కూడా ప్ర‌మోష‌న్ కోసం త్వ‌ర‌లో పోస్ట్ చేయ‌నుంది. క‌నుక స‌మంత సోష‌ల్ మీడియాకూ దూరం కావ‌డం ఉట్టి మాటే.