గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (14:43 IST)

చార్ ధామ్‌లో శిల్పారెడ్డితో సమంత..

Samantha
నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో సమంత కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సమంత పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 
 
సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటేనని స్పష్టం చేశారు. అయితే తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌కి కొంత స‌మ‌యం దొర‌క‌డంతో స‌మంత ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు ఫ్రెండ్ శిల్పారెడ్డితో వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేసుకుంది.
 
తాజాగా స‌మంత చార్ ధామ్‌లో శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. చార్‌ ధామ్‌ యాత్ర అద్భుతంగా సాగిందని తెలియ‌జేస్తూ ప‌లు ఫొటోలు కూడా షేర్ చేసింది. ఇక రిషీకేశ్‌లోని మహర్షి మహేశ్ యోగి ఆశ్రమాన్ని సందర్శించినట్టు పేర్కొంది. అంతేకాదు… అక్కడి కొన్ని ఫోటోలనూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 
 
1968లో మహేశ్ యోగి ఆశ్రమానికి బీటిల్స్ బృంద సభ్యులు వెళ్ళారు. అక్కడే కొన్ని రోజులు ఉండి ‘అతీంద్రియ ధ్యానం’ను అభ్యసించారు. ఆ సమయంలో వారు దాదాపు 48 పాటలను ఇదే ఆశ్రమంలో కంపోజ్ చేశారని సమంత తెలిపింది.