గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (17:30 IST)

పరువు నష్టం కేసు వేసిన సమంత ?

Samantha Prabhu
న‌టి స‌మంత ప్ర‌భు ప‌రువు న‌ష్టం కేసు వేసింద‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది సినీ ఇండ‌స్ట్రీలో. అది ఎవ‌రిపైన అనుకుంటున్నారు? నాగ‌చైత‌న్య‌పై అయితే పొర‌ప‌డిన‌ట్లే. విడిపోయినా ఇద్ద‌ర‌మూ స్నేహితులుగా వుంటామ‌ని ఇరువురూ స్ప‌ష్టం చేశారు కూడా. అయితే వీరి పెటాకుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి క‌లిగించింది. ఇంటిలో గొడ‌వ‌లు కంటే ప‌క్కింటి గొడ‌వ‌లు ఆస‌క్తిగా ఆల‌కించే నైజం ప్ర‌జ‌లది క‌నుక దాన్ని హైలైట్ చేసిన మీడియాపై కేసు వేసింద‌ని తెలుస్తోంది.
 
ముఖ్యంగా సామాజిక మాథ్యమాల్లో త‌మ గురించి ఇష్టానుసారంగా కామెంట్ చేసిన, స్పందించిన వారిపై స‌మంత గుర్రుగానే వుంది. కానీ అంత‌కంటే ఎక్కువ క‌థ‌లు, క‌థ‌నాలు ఊహించుకుని రాసిన వారిపై కేసు వేసింద‌ని గుసుగుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో నటి సమంత పరువు నష్టం దావా కేసు వేశార‌ట‌. .'సుమన్' టివి, 'తెలుగు పాపులర్' టీవీ , 'టాప్ తెలుగు' టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్ పై సమంత కేసు దాఖలు చేసిన‌ట్లు స‌మాచారం.