బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:11 IST)

మై హార్ట్ గోస్ ల‌డీడా ల‌డీడా.. అంటూ పాడుకుంటున్న అల్లు అర్జున్‌

Allu Arjun, snehareddy
అల్లు అర్జున్ ప‌నీ,పాటా రెండు స‌మ‌న్వ‌యంతో చేస్తుంటాడు. షూటింగ్‌లో ఎంత బిజీగా వున్న కాస్త గేప్ దొరికితే వీకెండ్ గా ఏదైనా సుదూర ప్రాంతాల‌కు వెళుతూ కుటుంబంలో గడుపుతుంటాడు. మాల్దీవులు, సింగ‌పూర్ వంటి కొన్ని అంద‌మైన ప్రాంతాల‌కు వెళ్ళి అక్క‌డ పిల్ల‌ల‌తో స‌హా ఎంజాయ్ చేస్తుంటాడు. 
 
ఇటీవ‌లే ద‌స‌రా సంద‌ర్భంగా మాల్దీవుల‌కు వెళ్ళిన‌ట్లు ఆయ‌న త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టిన పోస్ట్‌ను బ‌ట్టి అర్థ‌మైంది. స‌ముద్రం అల‌ల్లో బోట్‌పై స‌ర‌దాగా త‌మ ప్రేమ‌ను ఒక‌రికొక‌రు వ్య‌క్తం చేసుకునేలా హాలీవుడ్ గాయ‌ని, డాన్స‌ర్ బెక్కీ హిల్ ఆల‌పించిన `మై హార్ట్ గోస్ ల‌డీడా ల‌డీడా.` అంటూ సాగే ప్రైవేట్ ఆల్బ‌మ్‌ను జోడించారు. బోటులో గాలికి వీరిద్ద‌రి ముంగురులు కూడా వారితో తేలుతూ చూడ్డానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది.

ఇక త‌న ఆనందాన్ని అల్లు స్నేహారెడ్డి వ్య‌క్తం చేస్తూ, నా ప‌క్క‌నే నీతో వుంటే అంతా బాగా అనిపిస్తుంది. మాల్దీవుల‌లో సెల‌వుల్ల‌లో కుటుంబంతో గ‌డప‌డం మ‌ర్చిపోలేనిది అంటూ పోస్ట్ చేసింది. రీల్ లైఫ్‌లోనేకాదు రియ‌ల్‌లైఫ్‌లోనూ మంచి భ‌ర్త‌గా ఎలా వున్నాడ‌నేది సింబాలిక్‌గా వుంది.