గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (16:21 IST)

"పుష్ప" నుంచి 'శ్రీవిల్లి' రూపంలో రెండో సింగిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా కె.సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలోని పాటల్లో తొలి సింగిల్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో సాంగ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ నెల 13వ తేదీన ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ఖాతా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సాంగ్‌ను రష్మీకపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 
 
దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.