బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (18:37 IST)

ఒకే ఆల్బంలో బన్నీ - ఫాహద్ ఫాజిల్ : పుష్ప నుంచి మరో పోస్టర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా కె.సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్ర పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ పుష్ప మూవీ నుంచి.. విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్ మరియు ఇంట్రడ్యూసింగ్ వీడియోలు మంచి ఆదరణ పొందాయి.
 
తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ వదిలి చిత్రబృందం. ఒకే ఆల్బంలో హీరో బన్నీ అలాగే విలన్ ఫాహద్ ఫాజిల్ ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్… ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే.