బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:58 IST)

శంకర్ పల్లి తాహశీల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్

నిత్యం షూటింగులతో బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ తాహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తమశీల్దార్‌ కార్యాలయానికి ఆయన వచ్చారు. అయితే, ఏదో షూటింగ్ నిమిత్తం మాత్రం రాలేదు.
 
తాను కొనుగోలు చేసిన భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వచ్చారు. 
 
రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో అల్లు అర్జున్‌ రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. 
 
ఆ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం శుక్రవారం ఉదయం ఆయన శంకర్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. దీంతో అభిమాన హీరోను చూడటానికి జనాలు భారీ సంఖ్యలో తహశీల్దార్‌ ఆఫీస్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.