సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (14:27 IST)

న‌న్ను గుండెల్లో పెట్టుకుకున్నారుః అఖిల్ - నువ్వు మా వాడివిః అర‌వింద్‌

Akil - Aravind
`నేను అల్లు అరవింద్ లాంటి గొప్ప వ్యక్తి తో పని చేయడం నా అదృష్టం. ఎందుకో తనని చూస్తుంటే నాకు నా గాడ్ ఫాదర్ లా ఫీల్ కలుగుతుంది. మా ఫాదర్ కు ప్రామిస్ చేసినట్టుగా అరవింద్ గారు నన్ను గుండెల్లో పెట్టుకుని ఒక కొడుకులా చూసుకున్నారు. మీ ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉన్నా కూడా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు.అందుకు ధన్యవాదాలు,  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు అందరం  కూడా ఎంతో కష్టపడి  నిజాయితీగా హార్డ్ వర్క్ చేశాము .మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఈ దసరా పండుగకు మీ ముందుకు వచ్చాం. మా సినిమా ను ఆదరించిన ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ కు  దన్యవాదాలు` అని తెలిపారు హీరో అఖిల్. 
 
ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇద్దామను కున్నాము. మేము అనుకున్న ఈ కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది . థియేటర్లలో  విడుదల చేయొచ్చని తెలుగు ప్రేక్షకులు నిరూపించి మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చారు.  బన్నీ వాసు , బొమ్మరిల్లు భాస్కర్, వాసు వర్మ వీరంతా ఈ సినిమాకు పిల్లర్స్ గా నిల్చొని రెండున్నర సంవత్సరాల నుంచి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారని అఖిల్ అన్నారు.
 
ఇంకో రెండు తరాలు ఇలాగే సాగాలని ఆశిస్తున్నాను
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, పెళ్లికానివారితోపాటు పెళ్లి చేసుకుని 40 ఏళ్లుగా కాపురం చేసుకున్న వాళ్లు వీరందరూ కూడా ఈ సినిమా చూడాలి.ఎందుకంటే ఏ ఏ స్టేజి లో మనం మన కాపురాలు ఎలా చేశాము అనేది చూసుకోవడానికి నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. ఇది కమర్షియల్ గా మాట్లాడే మాట కాదు భాస్కర్ ఈ కథలో అటువంటి క్లారిటీ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే  "వాట్ డు యు యాక్సెప్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్" అనే పదము సినిమాలోచాలా సార్లు  వస్తుంది. కానీ రియల్  లైఫ్ లో ప్రతి ఒక్కరూ తిరిగి చూసుకునేలా ఈ సినిమా ఉంటుంది.మ్యారేజ్ అనే ఒక అవగాహనను ఇంత చక్కగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా చెప్పలేదు.ఎంతో కష్టపడి పని చేసిన ఈ సినిమా టీం కి కృతజ్ఞతల చెప్పుకుంటున్నాను..
 
ఇక భాస్కర్ తో సినిమా తీసేటప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయి. తనకు ఏది రావాలనుకుంటే అది వచ్చేవరకు తపన పడుతూనే ఉంటాడు .తను ఈ సినిమా తీయడానికి తన భార్య ఎంతో సపోర్ట్ చేసిందో నాకు అర్థ మవుతుంది. ఆమెకు ఈ స్టేజి మీద కృతజ్ఞతలు చెప్తున్నాను. 
 
అక్కినేని అల్లు ఫ్యామిలీ లతో 60 సంవత్సరాల పై నుండి ఈ జర్నీ సాగుతుంది. 60 సంవత్సరాల క్రితం మా నాన్న అల్లు రామ లింగయ్య గారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసారు. అప్పటి నుంచి వారు చాలా మంచి స్నేహితులు అయ్యారు. చివరి వరకూ వారు కలిసి ఉన్నారు .ఆ తర్వాత తరంలో నేను యాక్టర్ కాకపోయినా నాగార్జునతో నాకున్న అనుబంధం తో మా జర్నీ కొనసాగు తుంది.అలాగే ఆ తర్వాత నాగచైతన్య, ఇప్పుడు అఖిల్ తో సినిమా చేశాను. ఇవాళ నా పిల్లలు వీరు మంచి స్నేహితులు. ఇలా ఇంకో రెండు తరాలు కూడా ఇలాగే సాగాలని ఆశిస్తున్నాను. అందుకని ఈ విషయం నేను అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది..గోపి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.పూజా ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది .తన కెరియర్ లో ఈ సినిమా ద్వారా ఉన్నత శిఖరం లో నిలబెట్టిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అని అన్నారు
 
హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ .. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఊపిరి నిస్తుంది.ఈ సినిమా కోసం అందరూ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాలో చాలా గ్లామర్ గా మంచి పర్ఫార్మెన్స్ చేసావ్ అని చాలా మంది కాల్ చేశారు.  విభా లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన భాస్కర్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.