సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By వసుంధర
Last Modified: శనివారం, 16 అక్టోబరు 2021 (21:58 IST)

హబ్బ... అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అదుర్స్

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద మొదటి హిట్ సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను చాలా సంవత్సరాలు తెరపై కనిపించని బొమ్మరిల్లు భాస్కర్‌తో జతకట్టాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో పూజా హెగ్డేతో రొమాన్స్ చేశాడు. ఈ చిత్రం దసరా స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఎలా అలరించాడో చూద్దాం.

 
హర్ష (అఖిల్ అక్కినేని) యుఎస్‌లో బాగా స్థిరపడతాడు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం కాబోయే భార్యతో సంతోషంగా జీవించడానికి ఒక కొత్త బంగ్లాను కొంటాడు. దానిలో అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా తన వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి ప్రతిదీ సెట్ చేసుకుంటాడు. అతని తల్లిదండ్రులు (జయ ప్రకాష్, ఆమని) భారతదేశంలో హర్ష ఉన్న 20 రోజుల సమయంలో అతడికి వివాహం చేసేందుకు కొంతమంది అమ్మాయిలను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిలో అతడికి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు.

 
అలా హర్ష 'పెళ్లి చూపులు' ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు, అతని జాతకాలు సరిపోలడం లేదని అతని తల్లిదండ్రులు తిరస్కరించిన విభ (పూజా హెగ్డే) ఫోటోను అతను చూస్తాడు. అఖిల్ ఒక్కసారిగా విభ (పూజా హెగ్డే) వైపు ఆకర్షితుడవుతాడు. ఆమె తండ్రి సుబ్బు (మురళీ శర్మ) హర్ష ఆలోచనలకు పూర్తి భిన్నంగా వుంటాడు. మరి హర్ష తనకు నచ్చిన విభను వివాహం చేసుకుంటాడా? ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిందే?

 
బొమ్మరిల్లు భాస్కర్ ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో వచ్చాడు. అఖిల్‌ను లవర్ బాయ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇలాంటి కథలు గతంలో ఎన్నో వచ్చాయి. ఎన్నారై వ్యక్తి ఒక అమ్మాయి పట్ల ఆకర్షితుడవడం, మధ్యలో సమస్యలను ఎదుర్కొనడం వంటి అనేక సినిమాలలో చూడవచ్చు. అయితే భాస్కర్ ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే అంశాలతో వినోదాత్మకంగా తెరకెక్కించాడు. మొత్తమ్మీద ఈ దసరాకి అక్కినేని అఖిల్‌కు హిట్ పడిందని అనుకోవచ్చు.