గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (17:41 IST)

ఆయన నాకు గాడ్ ఫాదర్ - అమ్మ‌వారే ఆశీస్సులందించిందిః అఖిల్‌

Akhil Akkineni
గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు వస్తే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ మంచి కథలను సెలెక్ట్ చేసుకొని తీస్తారు.నేను అక్కడకు వెళ్లే వరకు కూడా బొమ్మరిల్లు భాస్కర్ కథ నెరేట్  చేస్తాడాని తెలియదు, భాస్కర్ గారు చెప్పిన కథ విన్న తరువాత నాకు కథలో వుండే కాన్సెప్ట్ నచ్చింది. ఒక లవ్ స్టోరీ కాకుండా మనం డైలీ రిలేషన్ షిప్ లో మ్యారేజ్ లైఫ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని ఒక ప్ర‌శ్న‌ అడిగి దానికి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నించడం నాకు కొత్తగా అనిపించింది. ఒక అబ్బాయికి అమ్మాయికి మద్యలో రిలేషన్ షిప్ ఒకటే కాదు జనరల్ గా మ్యారీడ్ లైఫ్ లో గానీ రిలేషన్షిప్ లో జరిగే ప్రాబ్లమ్స్ ని తెలియ జేయడం నాకునచ్చింది.అందుకే నాకు ఈ సినిమా సింగిల్ సిట్టింగ్ లోనే వచ్చింది. కథ కొత్తగా ఉండడమే కాక ఇందులో హర్ష అనే నా క్యారెక్టర్ బాగా నచ్చింది అందుకే నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను` అని అఖిల్‌ అక్కినేని తెలిపారు.
 
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే  జంట‌గా తెరకెక్కిన సినిమా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. మ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బ‌న్నీవాసు, వాసువ‌ర్మ నిర్మించారు. శుక్ర‌వారంనాడు విడుల‌కానున్న సంద‌ర్భంగా అఖిల్ ఇంటర్వ్యూ.
 
- నేను విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి వెళ్ళాము, కరెక్ట్ గుడి బయట ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది మా సినిమాకు ఏపి లో 100% ఆక్యుపెన్సీ లభించిందని మాకు అమ్మవారే బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపించింది. మాకు 100% ఆక్యుపెన్సీ ఇచ్చిన ఏపీ గవర్నమెంట్ కి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ వెరీమచ్.గవర్నమెంట్ ఇచ్చిన ప్రికాషన్  అందరూ సేఫ్ గా పాటిస్తూ వచ్చి మా సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాం. 
 
 - నాకు అరవింద్ గారు గాడ్ ఫాదర్, ఆయనతో చేయడం వలన  చాలా ఎక్స్పీరియన్స్ తో పాటు అన్ని వచ్చాయి. గీతా ఆర్ట్స్ నన్ను ఫ్యామిలీ మెంబర్ గా చూసు కున్నారు వారితో నా జర్నీ చాలా బాగుంది నన్ను ఎంతో కేర్ తీసుకొని చేశారు అరవింద్ గారికి బన్నీ వాసు గారికి అందరికీ ధన్యవాదాలు.
 
- ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కు, సెకండ్ ఆఫ్ కు ఒక జర్నీ ఉంది హర్ష అనే క్యారెక్టర్ కి నార్త్ నుండి సౌత్ కు జర్నీ చేసినట్టు ఉంటుంది. సినిమాలో వన్ టు ఇయర్స్ టైం గ్యాప్ కూడా ఉంటుంది.ఆ జర్నీ ఒక బాయ్ టూ మ్యాన్ మెచ్యూర్ అయ్యే స్టేజ్ లో ఒక జర్నీ చూపిస్తాం. ఆ జర్నీ ఒక కంఫ్యూజ్డ్ అబ్బాయి, ఒక అమాయక ఇన్నోసెంట్ లో ఉండే  అబ్బాయి నుంచి కాన్ఫిడెంట్ మ్యాన్ గా డెస్టినేషన్ ఎలా మారేడు అనేది చెప్పడానికి ట్రై చేసాము. 
 
- నేను కథ విన్న తర్వాత నాన్న గారు విన్నారు అమ్మకు కథ గురించి ఏమీ తెలియదు ఇవాళ సినిమా చూడబోతున్నారు.  అయితే నాన్నగారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను.ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగ పడుతుందని చెప్తే, కొన్ని కరెక్షన్స్ చేస్తాడు అని చెప తర్వాత  కొన్ని పాయింట్స్ సజెషన్స్ చేశాడు. 
 
- 'బొమ్మరిల్లు' సినిమా తీసుకుంటే ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్స్ అందరికీ ఉంటుంది కానీ అక్కడ అడ్రస్ చేసిన పాయింట్ ను చాలా చక్కగా చూపించాడు. ఆ సినిమాలో అడ్రస్ చేసిన ఇష్యూ లాంటిదే ఈ సినిమాలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్యలో కొన్ని ఇష్యస్ అడ్రెస్ చేశాడు ఆ ఇష్యూష్ కు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు.రేపు సినిమా చూసిన తర్వాత మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కు మేము చేసిన సొల్యూషన్స్ దారి చూపించారని నా ఫీలింగ్ అది సక్సెస్ అయితే మేము సక్సెస్ అయ్యినట్లే.. 
 
- ఏ ఫ్యామిలీ సినిమాకైనా మెయిన్ పిల్లర్  క్లైమాక్స్ ఇంపార్టెంట్ .ఈ సినిమాలో ఆయన అప్డేటెడ్ గానే ఆలోచించి చేశాడు. ఆయనకు  బొమ్మరిల్లు చేసి 15 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా ఆయన ఇప్పటికీ యూత్ లాగానే అప్డేటెడ్ గా ఆలోచించి సినిమాలు తీస్తాడు. ఇందులో కూడా అప్డేటెడ్ సెంటిమెంట్స్ , ఎమోషన్స్ , వాడిన మాటలు, చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా ఎక్కడ ఓల్డ్ గా ఔట్ డేటెడ్ గా అనిపించవు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్,ఫ్యూచరిస్తిక్ ఏంటర్ టైనర్. ఈ సినిమాలో  వల్గారిటీ ఏమీ ఉండదు ఫ్యామిలీ తో  ప్లెజర్ గా వెళ్లి చూసే  సినిమా ఇది.ఈ సినిమా చూసిన వారంతా కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు.
 
- సినిమాలో కథ లో పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్ ఉంటుంది. తెలుగు అబ్బాయి యు.యస్ నుంచి వచ్చి పెళ్లి చూపులు చూసి వెళ్లిపోవాలి కొంత సమయమే ఉంటుంది తనకు తిరిగి వెళ్ళిపోవడానికి ఆ కాన్సెప్ట్ లో ఐదు సీన్స్ వస్తాయి. ఇందులో స్ట్రాంగ్ యాక్టర్స్ ఉన్నారు. జాతిరత్నాలు  హీరోయిన్ ఫరీదా అప్పటికి ఆ సినిమా రేలీజ్ అవ్వలేదు ఇందులో తను సీన్స్ చేసేటప్పుడు వండర్ఫుల్ యాక్టర్ తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇలా తెలియకుండా యాక్ట్రెస్ చాలామంది ఇందులో ఉన్నారు 
 
- సినిమాకు రొమాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కాదు. అలాగే  రొమాన్స్ అంటే ఊరికే ముద్దు పెట్టడం కాదు. రొమాన్స్ అనేది ఫిజికల్ టచ్ ఒకటే కాదు అని గట్టిగా చెబుతాను. ఒక బర్త్ డే విషెస్ లో అక్కడ లేకున్నా అందమైన కార్డులో అక్షరాలు రాసినా రొమాన్స్ ఉంటుంది, పర్సనల్ గా వెళ్లకపోయినా పువ్వులు పంపించి విషెస్ చెప్పే దాంట్లో రొమాన్స్ ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలు చాలా అందంగా చెప్పారు భాస్కర్ గారు. రొమాన్స్ అనేది వన్ అఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ అని చెప్తారు. 
 
- పూజ చాలా హార్డ్ వర్క్ చేసింది. తను ఎప్పుడూ కెరీర్ మీదే దృష్టి పెట్టి  సినిమా సినిమాకి కష్టపడుతుంది.సినిమాలో తను స్పైసీ గా మాట్లాడాలి అయినా మేము దాన్ని చాలా ప్లేజెంట్ గా చూపించాము.తను చాలా ఎనర్జీ గా  తన క్యారెక్టర్ ను ఓన్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్గా సినిమా చేసింది.
 
- ఆమని గారితో సిసింద్రీ సినిమాకు నేను గుర్తు లేని టైంలో యాక్ట్ చేశాను మళ్లీ తనతో ఇప్పుడు మదర్ గా చేస్తున్నాను.తను నన్ను కొడుకులా చూసుకుంది .ఒక మదర్  కొడుకును ఎలా ట్రీట్ చేస్తుందో నన్ను అలా ట్రీట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
 
బాలీవుడ్... ఆ ఆలోచన లేదు. 
 
సినిమా బాగా ఆడుతుంది అనేది ఎప్పుడూ గ్యారంటీ ఇవ్వలేము  అందరం కూడా ఎంతవరకు కష్టపడి తీశాం అనేదే ముఖ్యం. మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది .కష్టపడి పనిచేసే వరకే మన పని రిజల్ట్ అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు బాలీవుడ్ కు వెళ్లాలని లేదు ఇక్కడే తెలుగులోనే మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. అనవసరంగా నన్ను బాలీవుడ్ కు పంపకండి ఇక్కడే నాకు కంఫర్ట్ గా ఉంది. 
 
కంటిన్యూ సినిమాలు ఉన్నాయి 
 
- నేను సినిమాలు స్పీడ్ పెంచాలని అనుకున్న టైంలో కోవిడ్ వచ్చింది. ఈ టు ఇయర్స్ లో నేను మాయమైనట్టు అనిపించింది. ఏజెంట్ షెడ్యూల్ కి ఆబ్రాడ్ వెళ్తున్నాను షూట్ బాగా జరుగుతుంది. ఇప్పటినుండి రెండు సంవత్సరాలు వరకు కంటిన్యూ సినిమాలు ఉన్నాయి అవి ఏంటనేది త్వరలో చెబుతాను.