హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ తో విక్రమ్ ఔర్ బేతాళ ఆధారంగా విక్రమ్ వేద
Hrithik Roshan and others
చందమామ కథల్లో విక్రమార్కుడు విక్రమార్కుడు బేతాళుడు కథ గుర్తుండే వుంటుంది. దీని ఆధారంగా హిందీలో విక్రమ్ వేద అనే సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ అబుదాబిలో హృతిక్ రోషన్ పూర్తి చేశారు. లక్నోలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్న కానుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రవేశించనున్నారు. 2022 సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఎస్.శశికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న సూపర్‌డూపర్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ విక్రమ్ వేదా. 27 రోజుల ఫస్ట్ షెడ్యూల్‌ని అబుదాబిలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్ పాల్గొన్నారు.
లక్నోలో జరిగే సెకండ్ షెడ్యూల్‌లో సైఫ్ అలీఖాన్ పార్టిసిపేట్ చేస్తారు.
హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్‌వేద ఒరిజినల్ సినిమా కథ రాసి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి ఇప్పుడు హిందీ రీమేక్‌నూ డైరక్ట్ చేస్తున్నారు.
పుష్కర్, గాయత్రి మాట్లాడుతూ ``గొప్ప స్టార్లు హృతిక్, సైఫ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాం. అత్యంత ఇంటెన్స్ , ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ను డెలివరీ చేస్తామనే నమ్మకం ఉంది`` అని అన్నారు.
భారత జానపద కథ విక్రమ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన నియో-నాయర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇద్దరు వ్యక్తులు. ఇద్దరూ సామాన్యులు కారు. ఒకరు పోలీస్.. ఇంకొకరు గ్యాంగ్‌స్టర్. ఆ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకోవడానికి పోలీస్ చేసిన ఆసక్తికర ప్రయత్నమే ఈ సినిమా.
టీసీరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ ``విక్రమ్ వేద మోస్ట్ ఎంటర్‌టైనింగ్, థ్రిల్లింగ్ సినిమాగా ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమా హిందీ రీమేక్ గురించి అనౌన్స్ చేయగానే ఆడియన్స్ లోనూ ఒక విధమైన ఎగ్జయిట్‌మెంట్‌నీ, ఆసక్తినీ గమనించాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత డైనమిక్ స్టార్స్ ఇద్దరినీ ఈ సినిమాతో మళ్లీ రీయూనిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లలో వాళ్లిద్దరు చేసిన మ్యాజిక్... బాక్సాఫీస్ దగ్గర చేసే సందడి గురించి అనుకుంటుంటే ఎప్పుడెప్పుడు సినిమాను విడుదల చేస్తామా అని అనిపిస్తోంది`` అని చెప్పారు.
నిర్మాత ఎస్.శశికాంత్ మాట్లాడుతూ ``నాలుగేళ్ల క్రితం తమిళ్‌లో విడుదలైన విక్రమ్ వేద సబ్జెక్ట్ ని, ఇప్పుడు హిందీలో ఇంకా అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. హృతిక్, సైఫ్ కలిసి ఈ కథను బౌండరీలు దాటించి ప్రపంచానికి పరిచయం చేయడానికి కృషి చేస్తున్నారు`` అని అన్నారు.