ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (13:11 IST)

బెల్లీ కంటే పోల్ డ్యాన్స్ ఇష్ట‌మంటున్న‌ జాక్వెలిన్

Jacqueline
ఇటీవ‌ల క‌థానాయిక‌లంతా త‌మ డైలీ కార్య‌క్ర‌మాలు, జిమ్, యోగాకు సంబంధించిన విష‌యాల‌ను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోల్ డేన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె చాక‌చ‌క్యం నెటిజ‌ర్లు ఫిదా అవుతున్నారు. ఒక‌రు బెల్లీడాన్స్ కూడా వ‌చ్చా అని అడిగితే.. దానికంటే పోల్ డాన్సే ఇష్ట‌మంటూ స‌మాధాన‌మిచ్చింది. ఇక జాక్వెలిన్ తాజాగా `రామ్ సేతు`లో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తోంది. ఇటీవ‌లే త‌న కొత్త బాయ్ ఫ్రెండ్ తో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. త‌న గృహంలోనే ఒక ప్లోర్ మొత్తం డాన్స్ వేయ‌డానికి అనుకూలంగా వుంటుంది. త‌న ట్రైనీతోపాటు ఆమె ఇలా ఫ్లీట్లు చేస్తూ క‌నిపించింది.
 
జాక్వెలిన్ ప్రస్తుతం హర్రర్-కామెడీ “భూత్ పోలీస్” విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామి గౌతమ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈమెకు ద‌క్షిణాది కూడా అభిమానులు వున్నారు. ఇటీవలే బాద్షా సాంగ్ “పానీ పానీ” అంటూ జాక్వెలిన్ ఆడిపాడిన సాంగ్ విడుదలైంది. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.