శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (20:51 IST)

సూర్యుడు అందాన్ని ఆస్వాదిస్తున్న అలియా

Alia Bhatt
బాలీవుడ్ న‌టి అలియా భట్ స‌ముద్రం ప‌క్క‌న వుండి సూర్యుడు అందాన్ని ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ఆమె ఆర్కైవ్ నుండి రెండు తాజా చిత్రాలను పంచుకున్నారు. అలియా తల్లి సోని రజ్దాన్ "అబ్బా బేబీ" అని వ్యాఖ్యానించారు. వావ్ అంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోస్ట్ చేసింది.
 
రెండవ చిత్రం ఆమె బాల్యంలోది. క‌రోనా టైంలో ఇవ‌న్నీ చూస్తుంటే థ్రిల్ క‌లుగుతుంది. చిన్న‌త‌నమే ఇంత‌కంటే హ్యాపీగా వుంది. ఇలాంటి క‌రోనా క‌ష్టాలు ఏమీ తెలియ‌వంటూ చెబుతోంది.  ఆమె ప్ర‌స్తుతం సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'గంగూబాయి ఖాటివాడి`లో న‌టించింది. తెలుగులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో' ఆర్.ఆర్.ఆర్`లో న‌టిస్తోంది.  రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ లతో' బ్రహ్మాస్త్రా 'కనిపించనున్నారు. అదేవిధంగా  COVID-19 గురించి సంబంధిత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఆమె ప్రఖ్యాత జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి పనిచేస్తుంది.