గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (14:03 IST)

ఔరంగజేబు చెల్లెలుగా జాక్వెలిన్, హరిహర వీరమల్లును ఏం చేస్తుంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లుక్ అదిరిపోయింది. ఈ చిత్రం వచ్చే 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలావుంటే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
 
మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్ నటించనున్నారట. ఆయన సోదరి పాత్రలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నట్లు సమాచారం. ఔరంగజేబు సోదరికి హరిహర వీరమల్లుకు మధ్య కెమిస్ట్రీ ఏంటన్నది మరో పాయింట్.
 
ఇకపోతే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.