గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (22:29 IST)

క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం: పవన్

సకల ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో పవన్ కల్యాణ్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం అని పవన్ స్పష్టం చేశారు. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
 
ఏసు అవతార పురుషుడని, ఆయన జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం అని పేర్కొన్నారు. ఏసు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన చేశారు.