సంబంధిత వార్తలు
- వర్మకు మెగా బ్రదర్ మద్దతు - "వర్మా... నీవు చెప్పింది అక్షరాలా నిజం" ట్వీట్
- ఏపీ మంత్రి పేర్ని నానికి వర్మ ప్రశ్నలు.. అలా చేస్తే మీకు ఓట్లు.. మాకు నోట్లు!
- ఏపీ సర్కారు కరోనా లాంటిది: రామ్ గోపాల్ వర్మ సంచలనం
- తెలంగాణాలో మొదలైన దోపిడీ! సినిమా టిక్కెట్ ధర రూ.295
- నన్ను అభినందించడానికి వచ్చి... ఎవరికైనా ఒమిక్రాన్ వస్తే....
అంతా నోర్లు మూసుకొని ఉంటే.. మీ ఖర్మ అంతే: ఆర్జీవీ
ఏపీ సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్రి పేర్ని నానికి రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా అనేక ప్రశ్నలు సంధించాడు. టికెట్ రేట్లు ఎందుకు మ్యానేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు? పేద వాడి కోసమే తగ్గించాలి అనుకుంటే రేషన్‌లో ఇచ్చే బియ్యం, పంచదార, కిరోషన్ లాంటివి పేదలకోసం ఇచ్చినట్టే "రేషన్ థియేటర్స్" అదే పేదల కోసం ప్రభుత్వం తరపున కట్టించవచ్చు కదా? అని ప్రశ్నించాడు.
అలాగే ఇక్కడ రెండు రకాల టికెట్ ధరలను పెట్టుకోండి నిర్మాతలు తమ సినిమాలకు ఒక ధర పెట్టుకుంటారు. మీరు మీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసుకొని మీ పేదలకు మీకు నచ్చిన తక్కువ ధరల రేట్లకే అమ్ముకొని మీ ఓట్లు మీరు తెచ్చుకోండి అని తెలిపాడు.
ఇక అలాగే ఫైనల్‌గా పవన్, అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలు విషయంలో మీ టీం హీరోల బట్టి కాకుండా సినిమాకి అయ్యే ప్రొడక్షన్ బట్టి ధరలు రెడీ చేసుకోవాలని తెలిపాడు.
దీని తర్వాత అసలు పోస్ట్ పెట్టాడు వర్మ "ఇది నా రిక్వెస్ట్ కాదు నా డిమాండ్ ఇది. మీ కొత్త ధరల వల్ల ఇండస్ట్రీలో అనేకమంది నాకు తెలిసినవారు చెప్పుకొని బాధ పడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అంతా నోర్లు మూసుకొని ఉంటే ఇక ఎప్పటికీ తెరవలేరు. మీ ఖర్మ అంతే" అని ముగించేశాడు
తర్వాతి కథనం
