బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (22:16 IST)

మంచు లక్ష్మికి కరోనా.. గో కరోనా గో అని గట్టిగా అరిచినా నన్ను పట్టుకుంది!

టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎందరో కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలకే కరోనా సోకింది. ప్రస్తుతం దక్షిణాది స్టార్లను కూడా కరోనా వదిలిపెట్టట్లేదు. 
 
తాజాగా సీనియర్ నటి మీనా తనకు, తనతో పాటు తన కుటుంబానికి కరోనా నిర్దారణ అయినట్టు ప్రకటించింది. ప్రస్తుతం మంచు లక్ష్మికి కరోనా సోకింది. ఫ్యామిలీతో ఎప్పుడూ చలాకీగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి మంచు లక్ష్మి తనకు కరోనా నిర్దారణ అయ్యిందని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పటికే మంచు ఫ్యామిలీలో ముందుగా మనోజ్‌కు కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఈ వైరస్ బారిన పడింది. 
 
"కరోనా లాంటి బూచోడితో రెండేళ్లు దాగుడుమూతలు ఆడిన తర్వాత, గో కరోనా గో అని గట్టిగా అరిచిన తర్వాత కూడా కరోనా నన్ను పట్టుకుంది. కరోనాకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు టీకా తీసుకొని ఉంటే.. బూస్టర్‌ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి" అంటూ పోస్ట్ చేసింది మంచు లక్ష్మి.