బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:08 IST)

దేవదాసీ పాత్ర‌లో... నా డాన్స్‌కి మంచి రెస్పాన్స్!

దేవదాసీ పాత్ర‌లో న‌టించ‌డం త‌న‌కు ఎంతో కొత్తగా అనిపించింది అంటోంది... చ‌లాకీ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. కలకత్తా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

 
తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ, ఈ సినిమాలో నేను చేసిన డాన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి  ఈ పాట హైలైట్ గా నిలుతుందని అనుకుంటున్నాము. నాకు డాన్స్ వచ్చుగదా అని ఈ పాటను పెట్టలేదు. సందర్భానికి తగినట్టుగానే ఈ పాటను పెట్టడం జరిగింది.

 
ఈ సినిమాలో నేను దేవదాసీ పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్రని అర్థం చేసుకుని చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. నా పాత్ర .. ఈ సినిమా రెండూ కూడా నాకు మంచి పేరు తీసుకువస్తాయని భావిస్తున్నాను.  మీ అందరితో పాటే నేను కూడా ఈ సినిమాను థియేటర్లో చూడటానికి ఉత్సాహంగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది సాయి ప‌ల్ల‌వి.