ఆచార్య చిత్రంలో హరిదాసులను కించపరిచే డాన్స్ సన్నివేశాలను తొలగించండి
ఇటీవల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రంలోని లాహే...లాహే...లాహే అనే పాటలో హరిదాసు(మాల దాసు)లతో డ్యాన్స్ చేయించి మాలదాసుల సామాజిక వర్గం ను కించపరిచే విధంగా ఉన్న డాన్స్ సీన్లను తొలగించాలని కోరుతూ మంగళగిరికి చెందిన ఆంధ్ర ప్రదేశ్ మాలదాసు, మాలదాసరి, మిత్తల అయ్య వార్ల హక్కుల సాధన పోరాట సమితి నాయకులు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేసి కోరారు.
హరిదాసు(మాల దాసు)లతో డాన్స్ లు చేయించి మాలదాసు సామాజిక వర్గం వారిని అవమాన పరచడమే కాకుండా, వారి మనోభావాలను కించపరిచే విధంగా ఉందని, ధనుర్మాసంలో నిత్యం హరి నామ స్మరణతో వీధుల వెంట తిరుగుతూ భక్తితో సంకీర్తనలు చేసే హరిదాసు(మాలదాసు)లతో డాన్సులు చేయించడం సరికాదని వారు ఆవినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర్లమూడి దుర్గారావు, నాయకులు మేకా వెంకటేశ్వరరావు, మల్లు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.