సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:46 IST)

ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించేందుకు యాజమాన్యాల అంగీకారం

ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించేందుకు యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. అనంతర ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  సమీక్షించారు.

సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరిగిన సమీక్షకు హాజరైన ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడుతూ.... యాజమాన్యాలు అంగీకారం తెలిపిన వాటిపై చేపట్టాల్సిన తదనంతర ప్రక్రియ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
బోధన, బోధనేతర సిబ్బంది సర్దుబాటు ప్రక్రియలో ఏ ఒక్క ఉపాద్యాయుడు లేదా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు.
 
ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కమిషనర్ పోలా భాస్కర్, పాఠశాల విద్య సంచాలకులు వి. చిన్న వీరభద్రుడు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.