శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (11:26 IST)

వాహనదారులపై ఉక్కుపాదం : ఒక్క చలానా ఉన్నా సీజ్‌

వాహనదారులపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ వాహనాన్ని సీజ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. 
 
గతంలో మూడు చలానాలు పెండింగ్‌లో ఉంటే సీజ్‌ చేసేవారు. గతేడాది సైబరాబాద్‌ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసి.. రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. ఉల్లంఘనులు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు. 
 
దీంతో సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు ఎంతో యాక్టివ్‌గా పనిచేస్తున్న విషయం తెల్సిందే.