సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (08:49 IST)

ఎల్బీ నగర్‌లో ఇద్దరిని మింగేసిన మ్యాన్ హోల్

హైదరాబాద్ నగరం ఎల్బీ నగర్‌ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో విషాదం ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజ్‌ క్లీనింగ్‌ కోసం మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు గల్లంతయ్యారు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్‌ నుంచి ఒకరి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మ్యాన్‌హోల్‌ ఊపిరాడకపోవడంతోనే మృతి చెంది ఉంటారని పోలీసులతో పాటు.. జీహెచ్ఎంసీ సిబ్బంది భావిస్తున్నారు.