సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (08:32 IST)

రైల్వే ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక వ్యాక్సినేషన్‌ శిబిరాలు: ద‌క్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రత, సరుకు లోడిరగ్‌, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుండి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆరు డివిజన్లు అయిన విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ మరియు నాందేడ్‌ డివిజినల్‌ రౖౖల్వే మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జోన్‌ పరిధిలో కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జనరల్‌ మేనేజర్‌ సమీక్షించారు.

రైల్వే సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్‌ సజావుగా అందేలా రైల్వే పరిసరాలలో ప్రత్యేక వ్యాక్సిన్‌ శిబిరాలను నిర్వహించాలని ఆయన అన్నారు. రైల్వే పరిసరాలలో ప్రత్యేకించి డోర్‌ టు డోర్‌ కార్యక్రమం ద్వారా రైల్వే సిబ్బందికి వేగవంతంగా వ్యాక్సినేషన్‌ చేపడుతున్న అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

రైల్వే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలతో పాటు ఆక్సిజన్‌ సరఫరా, పడకల లభ్యత, అవసరమైన మందులు ఏర్పాటు చేయడం, పీపీఈ కిట్లు మరియు మాస్కులు మొదలగు వాటి లభ్యతపై సమీక్షించారు. విధుల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ మరియు కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు.

రైల్వే ఆసుపత్రులలో అవసరం మేరకు మౌలిక సదుపాయాల కల్పన మరియు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జోన్‌లో రైళ్ల నిర్వహణ భద్రతపై గజానన్‌ మాల్య సవివరంగా సమీక్షించారు. భద్రతకు సంబంధించి సిబ్బందిలో మరింత అవగాహన కల్పించి, వారు రైళ్ల నిర్వహణలో భద్రతతో కూడిన ఉత్తమ పనితీరు ప్రదర్శించడానికై క్రమంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.

దీంతో అవాంఛనీయ ఘటనల నివారణకు మరియు వారి యొక్క స్వీయ రక్షణకై సిబ్బంది ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని అన్నారు. మరింత జాగృతతో ఉండడానికి మరియు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉండేలా ప్రధాన కార్యాలయాలు మరియు డివిజిన్ల స్థాయిలలో క్షేత్రస్థాయిలో క్రమంగా తనిఖీలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఏవైనా ఇబ్బందులను గమనిస్తే సంబంధిత సిబ్బందిని క్రమంగా అనుసరిస్తూ సరైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ యార్డులు మరియు సైడిరగ్స్‌ వద్ద కచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలని, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జనరల్‌ మేనేజర్‌ జోన్‌లో సరుకు రవాణా లోడింగ్‌పై సమీక్షించారు. సరుకు రవాణా అభివృద్ధికి ఉత్తమ పనితీరును కనబరుస్తున్న అధికారులను మరియు సిబ్బందిని ఆయన అభినందించారు.

సరుకు రవాణాలో మరింత అభివృద్ధికి నూతన మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు. నూతనంగా నిర్మించిన రైలు మార్గాల్లో వేగం పెంపుపై జనరల్‌ మేనేజర్‌ సమీక్షించారు. అవసరాలక‌నుగుణంగా హెచ్చరిక ఆదేశాలను తొలగించి రైళ్ల నిర్వహణలో వేగవంతానికి మరియు రద్దీ నివారణకు కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.